బాలాజీ నగర్ లో తీరిన రోడ్డు కష్టాలు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

బాలాజీ నగర్ లో తీరిన రోడ్డు కష్టాలు..!
– రూ. 5 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం
– ప్రారంభించిన చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధి 24వ వార్డులోని బాలాజీ నగర్ లో రోడ్డు కష్టాలు తీరనున్నాయి. మంగళవారం మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమల్ వార్డు కౌన్సిలర్ సాహు శ్రీలత లక్ష్మీకాంత్ తో కలిసి సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. 15వ ఆర్థిక సంఘం నిధులు రూ. 5లక్షలతో ఈ సీసీ రోడ్డు పనులు చేపడుతున్నారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ మాట్లాడుతూ తాండూరు పట్టణ సమగ్ర అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందన్నారు. పార్టీలకతీతంగా అన్ని వార్డుల్లో సీసీ రోడ్డు, మురుగు కాలువల నిర్మాణ పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. కౌన్సిలర్ సాహు శ్రీలత మాట్లాడుతూ బాలాజీ నగర్ లో సీసీ రోడ్డు లేక ప్రజలు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. రోడ్డు పనులు చేపట్టడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి, డీఈ, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

శభాష్.. ధీరజ్..!