సునీతకు రూరల్ ఎంటర్‌ప్రీనీయర్ ఆవార్డు

తాండూరు రాజకీయం వికారాబాద్

సునీతకు రూరల్ ఎంటర్‌ప్రీనీయర్ ఆవార్డు
– మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా అందజేత
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన అమ్మ ఆదరణ సోసైటీ అధ్యక్షురాలు సంగినేని సునీతకు రూరల్ ఎంటర్ప్రైనీయర్ ఆవార్డు దక్కింది. బ్యాక్ వర్డ్ క్లాసెస్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీబీఐసీసీఐ) ఆధ్వర్యంలో ఈ అవార్డును అందజేశారు. హైదరాబాద్లోని హైటెక్ సిటీ టీహబ్ లో జరిగిన సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా సునీత అవార్డును అందుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 500ల మంది సభ్యులు పోటీ పడగా 20 మందిని ఎంపిక చేశారు. అందులో వికారాబాద్ జిల్లా నుంచి సునీత ఎంపిక కావడంతో ఆమెకు అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, మాజీ స్పీకర్ మధుసూధన్ చారి, నటులు సాగర్, బీఐసీసీఐ వ్యవస్థాపకులు నారాయణ, మాజీ ఐఏఎస్ చిరంజీవులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

అప్రమత్తతతో ఎయిడ్స్ నివారణ