మున్సిపల్లో అవినీతి, అక్రమాలు..!
– నాలుగు నెలలుగా జరగని కౌన్సిల్ సమావేశం
– అద్దె జేసీబీతో కార్యకలాలు, బిల్లులు
– జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన సంగీత ఠాకూర్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధిలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని వికారాబాద్ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు గాంధీనగర్ 20వ వార్డు కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకూర్. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు ఫిర్యాదు చేశారు. తాండూరు మున్సిపల్ కార్యాలయంలో గల నాలుగు నెలలుగా కౌన్సిల్ సమావేశం నిర్వహించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన వార్డులో ఆక్రమణలు జరుగుతున్నాయని ఆరోపించారు. వార్డులో మురుగు కాలువల శుభ్రం కోసం మున్సిపల్ జేసీబీ ఇవ్వాలని కోరినా పట్టించుకోవడం లేదని తెలిపారు. అద్దె జేసీబీలతో పనులు చేయిస్తూ బిల్లలు స్వాహా చేస్తున్నారని ఆరోపించారు. తాండూరు మున్సిపల్లోల జరిగే అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
ఇదికూడా చదవండి…

