శాంతి భద్రతల పరిరక్షణకు కృషి

కెరీర్ తాండూరు వికారాబాద్

శాంతి భద్రతల పరిరక్షణకు కృషి
– తాండూరు డీఎస్పీ బాలక్రిష్ణ రెడ్డి
– నూతన డీఎస్పీగా బాధ్యతల స్వీకరణ
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు సబ్ డివిజన్లో శాంతి భద్రతల పరిరక్షణకు తనవంతు కృషి చేస్తానని తాండూరు డీఎస్పీ బాలక్రిష్ణ రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు నూతన డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన డీఎస్పీ జీ. శేఖర్ గౌడ్ నుంచి చార్జ్ తీసుకుని తాండూరు డీఎస్పీగా సంతకం చేశారు. అనంతరం డీఎస్పీ బాలక్రిష్ణ రెడ్డి మాట్లాడుతూ తాండూరు సబ్ డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని అన్నారు. ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించేలా, అసాంఘీక శక్తులను అరికట్టేలా పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు. తాండూరు డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన బాలక్రిష్ణ రెడ్డికి పోలీసు అధికారులు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్ డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఉత్తర్వులు జారీ అయిన సంగతి తెలిసిందే.

ఇది కూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!