జాతర భక్తులపై కుక్కల దాడి..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

జాతర భక్తులపై కుక్కల దాడి..!
– తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
– మెరుగైన వైద్యం కోసం ఇద్దరి రిఫర్
– యాలాల ముద్దాయి పేట్ జాతరలో ఘటన
తాండూరు, దర్శిని ప్రతినిధి : జాతరకు వెళ్లిన భక్తులపై వీది కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో గాయపడిన బాధితులను తాండూరులోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఇందులో ఇద్దరిని మెరుగైన వైద్యం కోసం రిఫర్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. యాలాల మండలం ముద్దాయిపేట్ లో రేణుకా ఎల్లమ్మ జాతర ఉత్సవాలు జరుగుతున్నాయి. శుక్రవారం యాలాల మండలంలోని పలు గ్రామాల భక్తులతో పాటు వివిధ గ్రామాల ప్రజలు జాతర ఉత్సవాలకు వచ్చారు. అక్కడ ఉన్న ఊర కుక్కలు జాతరకు వచ్చిన భక్తులపై దాడి చేశాయి. ఈదాడిలో గాయపడిన నలుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులను తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇందులో ఇద్దరు వృద్ధులు ఉన్నారు. ఇక్కడ ప్రాథమిక వైద్యం అందించిన వైద్యులు ఇద్దరిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ రిఫర్ చేశారు. మరో ఇద్దరు చిన్నారులను హైదరాబాద్ రోడ్డు మార్గంలోని మాతా శిశు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు వృద్ధులు పగిడాలకు చెందిన లక్ష్మమ్మ, వివ్వనాథ్ పూర్ కు చెందిన లాలమ్మలకు చికిత్స అందించారు.

ఇదికూడా చదవండి…

ఎల్లుండి తాండూరులో ముగ్గుల పోటీలు