పారని దళిత బంధు మంత్రం..?
– శాలిపల్లిలో టీఆర్ఎస్‌కు షాక్ ఇచ్చిన ఓటర్లు
– టీఆర్ఎస్ కన్నా బీజేపీకే అత్యథిక ఓట్లు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెట్టిన దళిత బందు మంత్రం హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పారలేదు. ఉప ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సీఎం కేసీఆర్ హుజూరాబాద్‌లోని శాలపల్లి గ్రామంలో దళిత బందు పథకాన్ని ప్రవేశ పెట్టారు. ఉప ఎన్నికలో దళిత బంధు పథకం ఓటర్లపై ప్రభావం చూపించనట్లుగా కనిపిస్తోంది. మంగళవారం ప్రారంభమైన హుజూరాబాద్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో బీజేపీకి 312 ఓట్లు పోల్ కాగ టీఆర్ఎస్‌కు 175 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. దీంతో టీఆర్ఎస్ ఆ ప్రాంత ఓటర్లు షాక్ ఇచ్చినట్లుగా మారింది.
