మరికాసేపట్లో.. తెలంగాణ ఎంసెట్ ఫలితాలు..
చెక్ చేసుకోండి ఇలా..!
దర్శిని ప్రతినిధి : తెలంగాణ ఎంసెట్ ఫలితాలను అధికారులు మరికాసేపట్లో విడుదల చేయబోతున్నారు. సరిగ్గా ఉదయం 11 గంలకు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైదరాబాద్ జేఎన్‌టీయూలో విడుదల చేయనున్నారు. అభ్యర్థులు సాధించిన మార్కులతో పాటు, వారి ర్యాంకులను కూడ ప్రకటించబోతున్నారు. 11 గంటల తరువాత అభ్యర్థులు నేరుగా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి..
* అభ్యర్థులు ముందుగా ఎంసెట్ అధికారిక వెబ్‌సైట్ eamcet.tsche.ac.inను సందర్శించాలి.
* అనంతరం హోమ్ పేజీలో ఉండే TS EAMCET result 2021 లింక్‌పై క్లిక్ చేయాలి.
* తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్‌తో పాటు పుట్టిన తేదీని ఎంటర్ చేయాలి.
* చివరిగా సబ్‌మిట్ బటన్‌పై క్లిక్ చేసి రిజల్ట్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
