దస్తగిరిపేట్‌కు ముక్కోటి శోభ..!
– శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
– ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకున్న ప్రముఖులు, నేతలు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం అంతారం అనుబంధ గ్రామం దస్తగిరిపేట్‌కు ముక్కోటి శోభ సంతరించుకుంది. శుక్రవారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా గ్రామంలోని శ్రీ శ్రీదేవి భూదేవి శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులు పోటేత్తారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయంలో వెలసిన స్వామి వార్లకు ఉదయం 4-30గంటలకు మేలు కొలుపు సేవ నిర్వహించారు. ఉదయం 5 గంటలకు విశేష పూజ అనంతరం భక్తులకు ఉత్తర ద్వారా దర్శన భాగ్యం కల్పించారు.
ఉదయం నుంచే తాండూరు పట్టణంతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు దేవాలయానికి పోటెత్తారు. ఉత్తర ద్వారం గుండా భక్తులు దేవాలయంలోని శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానికి వచ్చిన భక్తులు గోవిందా..గోవిందా.. వెంకటరమణ నామస్మరణతో మార్మోగించారు. తాండూరు నియోజకవర్గంకు చెందిన ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు, అధికారులు, నేతలు దేవాలయానికి వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయంలో పలువురు సేవ చేసుకున్నారు. భక్తుల తాకిడితో ఆలయ ప్రాంగణం కిక్కిరిసి పోయింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆలయ కమిటి సభ్యులు ఏర్పాట్లు చేశారు. పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

ఇది కూడా చదవండి….

