శంకరన్న భక్తి.. సేవ..!

తాండూరు రాజకీయం వికారాబాద్

శంకరన్న భక్తి.. సేవ..!
– ప్రతి యేడాది శ్రీశైల పాదయాత్ర భక్తులకు అన్నదానం
– గొప్ప మనసును చాటుకున్న భావనోళ్ల శంకర్ యాదవ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన శ్రీసాయిపుత్ర హోమ్స్ అండ్ డెవలపర్స్ అధినేత, రియల్ ఎస్టేట్ వ్యాపారి భావనోళ్ల శంకర్ యాదవ్ మరోసారి దైవభక్తుల పట్ల సేవను చాటుకున్నారు. ప్రతి యేడాది మాదిరిగానే ఈ యేడాది కూడా శ్రీశైలంకు పాదయాత్రగా వెళ్లే భక్తులకు శంకర్ యాదవ్ అన్నదానం చేశారు. గత ఆరేళ్లుగా శంకర్ యాదవ్ పాదయాత్ర భక్తులకు అన్నదానం చేస్తున్నారు. తాజాగా గురువారం తాండూరు నుంచి పాదయాత్రగా వెళ్లిన భక్తులకు కోడంగల్ సమీపంలోని ఉడిమేశ్వరం వద్ద సుమారు 100 మంది భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి శంకర్ యాదవ్, సతీమణీ చంద్రకళ, తండ్రి హనుమయ్యలతో కలిసి భక్తులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా శంకర్ యాదవ్ మాట్లాడుతూ దైవకృపతో భక్తులకు సేవ చేయడం సంతోషాన్ని ఇస్తుందన్నారు. భక్తులకు అన్నదానం చేయడం ఆత్మసంతృప్తిని కలిగిస్తుందన్నారు. ప్రతి యేడాది శ్రీశైలం వెళ్లే భక్తులకు అన్నదానం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, బంటు మల్లప్ప, జొన్నల వినోద్, ప్రేమ్ కుమార్, మల్ రెడ్డి, శ్రీనివాస్, మల్లేష్, వి ఠల్, వెంకట్, గోపాల్, కిరణ్ కుమార్, శంకరన్న యువసేన సంఘం సభ్యులు, స్నేహితులు, బందుమిత్రులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

కాంగ్రెస్‌ను విమర్శించే అర్హత శ్రీనివాస్‌రెడ్డికి లేదు..!