కుల‌, మ‌తాల‌కు అతీతం ర‌క్షాబంధ‌న్

తాండూరు రంగారెడ్డి వికారాబాద్

కుల‌, మ‌తాల‌కు అతీతం ర‌క్షాబంధ‌న్
– ముస్లిం సోద‌రుల‌కు రాఖీ క‌ట్టిన దీపా న‌ర్సింలు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : అన్నాచెల్లెల్లు, అక్కా త‌మ్ముళ్ల అనుబంధానికి ప్ర‌తీక‌గా నిలిచే ర‌క్షాబంధ‌న్ కుల మ‌తాల‌కు అతీమ‌ని తాండూరు మున్సిప‌ల్ వైస్ చైర్‌ప‌ర్స‌న్ ప‌ట్లోళ్ల దీపా న‌ర్సింలు అన్నారు. ఆదివారం రాఖీ పౌర్ణ‌మి సంద‌ర్భంగా ఆమె త‌న నివాసంలో ముస్లిం సోద‌రుల‌కు రాఖీ క‌ట్టారు. హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం రాఖీలు క‌ట్టి స్వీట్లు తినిపించారు.

ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రేమ, కరుణ, సహన సీలతకు రాఖీలు నిదర్శనమన్నారు. త‌ర‌, త‌మ భేధాలు లేకుండా అనుబంధాల‌ను పెంపొందించే రక్షాబంధ‌న్ కుల మ‌తాల‌కు అతీత‌మైంద‌న్నారు. అనంత‌రం ఆమె తాండూరు ప‌ట్ట‌ణ ప్ర‌జ‌ల‌కు రాఖీ పౌర్ణ‌మి శుభాకాంక్ష‌ల‌ను తెలిపారు.