కట్టకుంటే… పెనాల్టీ మోత..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

కట్టకుంటే… పెనాల్టీ మోత..!
– వాహనాల టాక్స్ బకాయిలపై హెచ్చరిక
– చెల్లింపులకు రేపటి వరకు చాన్స్
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లాలో వాహనాల టాక్స్ వసూళ్లపై రవాణా శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. సకాలంలో టాక్సులు చెల్లించని వాహనాలపై భారీగా పెనాల్టీలు విధించాలని నిర్ణయించింది. ఏకంగా 200శాతం శాతం పెనాల్టీ విధించేందుకు సిద్దమైంది. వాహనాల త్రైమాసిక పన్నుల వసూళ్లకు సంబంధించి జిల్లాలో సుమారు రూ. 2కోట్ల వరకు బకాయిలు ఉన్నట్లు అధికారులు లెక్కలు వేశారు. జిల్లాలో సుమారుగా 5000 పైగా వాహనాల యొక్క పన్ను బకాయిలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ట్రాకార్స్ ట్రావెల్స్ హర్వేస్తీర్స్ భారీ వాహనాలు, మధ్య , చిన్న వాహనాలు, బోర్ బండ్ల వాహనాలు, గ్రామ పంచాయతీ, మున్సిపల్ వాహనాలు, స్కూల్ బస్సుస్, సీసీ బస్స్ టక్టర్ ట్రావెల్స్ ఉన్నాయి.

ఇప్పటికే రవాణా శాఖ అధికారి వెంకట్ రెడ్డి టాక్స్ చెల్లింపులకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. వాహనదారులు తమ రవాణా వాహనాల యొక్క త్రైమాసిక పన్నును ఈ నెల రేపటి లోపు మీసేవలో గానీ, ఆన్లైన్లో గానీ చెల్లించాలని సూచించారు. గడువులోపు చెల్లించని వాహనాలకు అపరాధ రుసుము 200 ‘/.శాతం చెల్లించవలసి వస్తుందని హెచ్చరించారు. అదేవిధంగా వాహనదారులను తమ వాహనాన్ని వారి మొబైల్ నెంబర్ కి లింక్ చేసుకోమని ఆయన సూచించారు. లింకు చేసుకుంటే… వాహనానికి సంబంధించిన సమాచారం లైసెన్స్ రెన్యువల్, పిట్నిస్స్ రెన్యువల్, టాక్స్ పేమెంట్స్ తదితర సమచారాన్ని నేరుగా మోబైల్‌లోనే అలర్ట్ రూపంగా పొందవచ్చని తెలిపారు. పూర్తి వివరాలకు సెల్‌ : 9848528441కు సంప్రదించాలన్నారు.

ఇదికూడా చదవండి…

మత్తుతో జీవితాలు చిత్తు..!