నమోః కుంభమేళా అన్న నాగారం..!
– ప్రయాగ్‌లో పులకించిన గ్రామ భక్తులు
– త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు
కోడంగల్, దర్శిని ప్రతినిధి : అత్యంత పరమ పవిత్రంగా కొనసాగుతున్న మహాకుంభ మేళాకు వికారాబాద్ జిల్లా కోడంగల్ మండలం నాగారం భక్తులు నమోః నమామి పలికారు. నాగారంకు చెందిన 19 మంది భక్తులు కుంభమేళాకు బయల్దేరి వెళ్లారు. సోమవారం వసంత పంచమి సందర్భంగా ఉత్తర ప్రదేశ్ ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించారు. అదేవిధంగా వైజాగ్ పూరి జగన్నాథ్, బైధనాథ్, బుద్ధగాయ, కాశీ, అయ్యోధ్య పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దైవ కృపతో ప్రజలందరు సుభిక్షంగా ఉండాలను ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్లోళ్ల మదనసింహ రెడ్డి, పట్లోళ్ల ప్రసాద్ రెడ్డి, తమ్మాలి పాండు, వై. బీంరెడ్డి, యు. సాయిలు, డి. సాయిలు, యు. నర్సిములు, ఈ. నర్సిములు, యు. జెన్నప్ప, యు. కాశప్ప, కేశవ్, అనిల్, యు. రాజు, యు. శ్రీను, సి. అశోక్, సి. అయ్యప్ప, ఎం. కృష్ణ, ఎం. శ్రీశైలం, యు. శ్రీశైలం తదితరులు ఉన్నారు.
ఇదికూడా చదవండి…

