పెళ్ళికి వెళ్లితే.. ఇల్లు గుల్ల..!
– తాళం వేసిన ఇంట్లో భారీ చోరీ
– సుమారు 40 తులాల బంగారం అపహరణ
– పరిశీలించిన తాండూరు డీఎస్పి
– తాండూరు పట్టణం సాయిపూర్లో కలకలం
తాండూరు, దర్శిని ప్రతినిధి: పెళ్ళికని ఇంటికి తాళం వేసి వెలితే.. దొంగలు చొరబడి ఇంటిని గుల్ల చేశారు. ఇంటి తాళాలు పగలగొట్టి సుమారు 40 తులాల బంగారం ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. ఈ సంఘటన తాండూరు పట్టణం సాయిపూర్లో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే… సాయిపూర్ కు చెందిన పట్లోళ్ల వెంకటేష్, సరళ దంపతులు ఈ నెల 6న కుటుంబ సభ్యులతో కలిసి ధారూర్ మండలం నాగసానిపల్లిలో అక్క కుమారుడు పెళ్లి కోసం ఇంటికి తాళం వేసి వెళ్లారు. పెళ్లి కార్యక్రమాలు ముగించుకుని శనివారం ఉదయం 11 గంటలకు సాయిపూర్ లోని వారి వివాసానికి చేరుకున్నారు. అప్పటికే ఇంటి తాళాలు పగలగొట్టి ఉండడంతో ఆందోళన గురయ్యారు.
ఇంట్లోకి వెళ్లి చూడగా వస్తువులన్నీ చిందరవందరుగా పడి ఉండడంతో అంతా పరిశీలించగా ఇంట్లో ఉన్న సుమారు 40 తులాల బంగారం, ఆభరణాలు అపహరణకు గురైనట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. తాండూరు డీఎస్పి బాలకృష్ణారెడ్డి, సిఐ సంతోష్ కుమార్, ఎస్సై రమేష్ లు బాధిత కుటుంబముకులతో మాట్లాడారు. జరిగిన చోరీ గురించి వివరాలను ఆరా తీశారు. దీంతో ఈ సంఘటన స్థానికంగా కలకాలం రేపింది. పరిశీలించిన పోలీసులు క్లూస్ టీమ్ ను రంగంలోకి దించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న తాండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు పట్లోళ్ల నరసింహులు, పలువురు బయట కుటుంబాన్ని పరామర్శించారు.
ఇది కూడా చదవండి…

