సెక్యూరీటీ గార్డుకు ఎంత కష్టం…!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

సెక్యూరీటీ గార్డుకు ఎంత కష్టం…!
– జీతాలు ఇవ్వడం లేదని గార్డు ఆత్మహత్యాయత్నం
– బాధతుడు జిల్లా ఆసుపత్రి సెక్యూరీటీ గార్డు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఏండ్లుగా ఆసుపత్రిలో సెక్యూరీటీ గార్డుగా పనిచేస్తున్నా.. సరైన వేతనాలు, పీఎఫ్‌లు చెల్లించకపోవడంతో ఓ సెక్యూరీటీ గార్డు పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన తాండూరు పట్టణంలో జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు పట్టణం పాత తాండూరుకు చెందిన నర్సింలు అనే వ్యక్తి స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో గత 30 ఏండ్ల నుంచి సెక్యూరీటీ గార్డుగా పనిచేస్తున్నారు. వివిధ ఏజెన్సీల ద్వారా విధులు నిర్వహిస్తున్నారు.

అయితే గత మూడేళ్ల నుంచి పీఎఫ్‌ రాకపోవడంతో పాటు గత నాలుగు నెలల నుంచి వేతనాలు అందడం లేదు. ఇందులో రెండు నెలల వేతనాలు అందించినా.. ఇంకా రెండు నెలల వేతనాలు రావాల్సి ఉందని నర్సింలు తెలిపారు. తన కూతురు పెళ్లి పెట్టుకోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. పెండింగ్ జీతాలు చెల్లించాలని ఏజెన్సీ నిర్వహకులను కోరినా పట్టించుకోకపోవడంతో మనస్థాపంకు గురయ్యాడు. సోమవారం పురుగుల మందు తాగాడు. గమనించిన స్థానికులు, కుటుంభీకులు చికిత్స నిమిత్తం నర్సింలు పనిచేస్తున్న జిల్లా ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం నర్సింలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్న కార్మిక, ఉద్యోగులను ఆదుకోవాలని పలువురు కోరారు. గతంలో కూడా ఓ యువకుడు వేతనాలు చెల్లించకపోవడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పటికైనా అధికారులు, ప్రతినిధులు స్పందించి నర్సింలుకు న్యాయం చేయాలని కోరారు.

ఇదికూడా చదవండి…

గాల్లో తేలుకుంటూ పరీక్షా కేంద్రానికి..!