ఒక్క కేసు పెండింగ్‌లో ఉంచొద్దు…!
– సీసీటీవీ, చోరీలపై అవగాహన కల్పించాలి
– రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి
– వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : పోలీస్టేషన్లలో ఒక్క కేసు ఫైల్ పెండింగ్‌లో ఉంచరాదని వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి సూచించారు. మంగళవారం జిల్లా ఎస్‌పి శ్రీ కె.నారాయణ రెడ్డి జిల్లా పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లాలో నమోదు అయిన కేసుల యొక్క వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్ఆడుతూ స్టేషన్లలో ఎలాంటి ఫైల్ లు పెండింగ్ లో ఉంచవద్దు, ఎప్పటికప్పుడే అప్డేట్ చేసుకోవాలని అన్నారు. అదేవిధంగా ఆన్లైన్ నందు కూడా ఎలాంటి ఫైల్స్ పెండింగ్ లో పెట్టవద్దన్నారు.
ప్రతి యొక్క పోలీస్ అధికారి Functional vertical ల పైన ప్రత్యేక దృష్టి కేటాయించాలని యూఐ కేసులు, NBWS, పాత పెండింగ్ కేసులు, ఫోక్సో కేసులు, ఎస్సీ, ఎస్టీ కేసులు, NDPS యాక్ట్ కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అదేశించారు. దీంతో పాటు కోర్ట్ డ్యూటి ఆఫీసర్స్ తో పోలీస్ అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయంతో కేసులలో కన్వెక్షన్ శాతాన్ని పెంచాలని అన్నారు. పోలీస్ అధికారులు ప్రతి శనివారం పోలీస్ స్టేషన్ సిబ్బంది తో సమావేశాలను తప్పని సరిగా ఏర్పాటు చేసుకొని అందరూ పోలీస్ సిబ్బందితో పోలీస్ అధికారులు మాట్లాడాలని సూచించారు. పోలీస్ అధికారులందరు రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యలకు గల కారణాలు తెలుసుకొని వాటి నియంత్రణకు కృషి చేయాలన్నారు.
అంతేకాకుండా ప్రజలలో సీసీటీవీల పైన అవగాహన కల్పించాలని, డైల్ 100 కాల్స్ పైన నిర్లక్ష్యం చేయవద్దు అని అన్నారు. చోరీ కేసులపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని, దొంగతనాలపైన ప్రజలలో అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమం లో అదనపు ఎస్పీ టివి హనుమంత్ రావు, తాండూరు, పరిగి, వికారాబాద్, డీసీఆర్బీ డీఎస్పీలు, ఏఆర్ డీఎస్పీలు, జిల్లా ఇన్స్పెక్టర్లు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

