ప్రజావాణిలో 12 దరఖాస్తులు
– తొలిరోజు స్పందన అంతంతే
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో 12 దరఖాస్తలు నమోదయ్యాయి. ఈ విషయాన్ని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశాలతో చాలా రోజుల తరువాత ఆర్డీఓ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించారు. డివిజన్ స్థాయిలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి తొలిరోజు 12 దరఖాస్తులు అందాయి.

ఇందులో 11 రెవెన్యూ, 1 మున్సిపల్, 1 ఇరిగేషన్ శాఖకు సంబంధించి దరఖాస్తులు అందినట్లు ప్రకటనలో తెలిపారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఆర్డీఓ శ్రీనివాస్ రావు అందుబాటులో లేకుండా పోయారు. సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం కోడంగల్‌లో కడా రివ్యూ సమావేశానికి వెళ్లినట్లు అధికారులు తెలిపారు. దీంతో కిందిస్థాయి అధికారులు ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.
ఇదికూడా చదవండి…

