ముదిరాజుల సంబరం
– ఈటెల గెలుపుపై హర్షం
తాండూరు, దర్శిని ప్రతినిధి : హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ భారీ మెజార్టీతో గెలవడంతో తాండూరులో అభిమానులు సంబురాలు జరుపుకున్నారు. తాండూరు ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. పట్టణంలోని శాంత్ మహాల్ చౌరస్తా వద్ద సంబరాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అధ్యక్షులు ఎస్పీ రవి జిల్లా అధ్యక్షులు, లొంక నరసింహులు, మాజీ కౌన్సిలర్ పరిమళ తదితరులు మాట్లాడుతూ ముదిరాజ్ ముద్దుబిడ్డ ఈటల రాజేందర్ బిజెపి అభ్యర్థిగా హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ముదిరాజ్ యువజన అధ్యక్షులు శ్రీకాంత్ ముదిరాజ్, సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
