వ్యాక్సినేషన్ లక్ష్యంపై నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు
– వంద శాతం పూర్తిచేసేందుకు కృషి చేయాలి
– తాండూరు తహసీల్దార్ చిన్నప్పల నాయుడు
తాండూరు, దర్శిని ప్రతినిధి : కరోనా వ్యాక్సీనేషన్ పంపీణీని పూర్తి చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శించరాదని తాండూరు తహసీల్దార్ చిన్నప్పల నాయుడు అన్నారు. బుధవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో బిఎల్వో, వీఆర్ఓ అంగన్‌వాడి టీచర్లు, సూపర్ వైజర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ చిన్నప్పల నాయుడు మాట్లాడుతూ వ్యాక్సీనేషన్‌పై బృందాలుగా ఏర్పడి మున్సిపల్ పరిధిలో ఇంటింటి సర్వే చేపట్టాలన్నారు. కోవిడ్ వ్యాక్సీనేషన్ వేసుకోని వారిని గుర్తించాలన్నారు. రెండు రోజుల్లో సర్వే పూర్తి చేసి వ్యాక్సీనేషన్‌ను వంద శాతం పూర్తి చేయాలన్నారు.
అనంతరం తహసీల్దార్ విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటి వరకు 30911 మంది ఫస్ట్ డోసు వేసుకున్నారని, 12948 సెకండ్ డోసు వేసుకున్నారని వెల్లడించారు. తాండూరు పట్టణానికి చెందిన దాదాపు 967 మంది ప్రవేటుగా వేసుకున్నారని, ఇంకా 18271మంది టీకా వేసుకోలేదని వివరించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఇంటింటి సర్వే అనంతరం ప్రతి ఒక్కరు టీకా వేసుకునేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ బుచ్చిబాబు, రెవెన్యూ అధికారులు, టీజేఎస్ ఫ్లోర్ లీడర్ సోమశేఖర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
