సామాన్యులకు శుభవార్త…!

తెలంగాణ రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

సామాన్యులకు శుభవార్త…!
– వచ్చే ఉగాది నుంచి సన్నబియ్యం
– రేషన్ దుకాణాల నుంచి పంపిణీకి కసరత్తు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని సామాన్య ప్రజలకు కాంగ్రెస్ సర్కారు శుభవార్తను అందించబోతోంది. రేషన్ షాపుల ద్వారా పేదలకు ఉచితంగా సన్నబియ్యం అందిచేందుకు కసరత్తు చేస్తోంది. వచ్చే ఉగాది పండుగ నుంచి రేషన్ షాపుల్లో సన్నబియ్యాన్ని ఇస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే ప్రకటించారు. దీంతో పేదలు రేషన్ షాపుల్లో సన్నబియ్యాన్ని పొందే అవకాశం ఉంటుంది.

ప్రస్తుతం ఇస్తున్న దొడ్డు రకం బియ్యాన్ని చాలామంది తీసుకుంటున్నప్పటికీ వాటిని వండుకుని తినే పరిస్థితి లేదు. దొడ్డు బియ్యం తీసుకువెళ్లి, వాటిని తిరిగి షాపుల్లో ఇచ్చేసి సన్నబియ్యాన్ని కొనుగోలు చేసుకుంటున్నారు పేదలు. అయితే ఈ విషయాన్ని గుర్తించిన కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో రేషన్ షాపుల్లో సన్నబియ్యాన్ని సరఫరా చేస్తామని హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీ మేరకు సన్నబియ్యాన్ని నిరుపేదలకు రేషన్ షాప్ ల ద్వారా అందించేందుకు రెఢీ అవుతోంది.

ఈ నేపథ్యంలోనే సన్నబియ్యాన్ని సరఫరా చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఈ ఖరీఫ్‌ సీజన్‌లో రైతుల నుంచి రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ 53.95 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. కొనుగోలు చేసిన సన్న ధాన్యాన్ని మిల్లర్లకు కేటాయించగా.. ప్రస్తుతం అక్కడ కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ జరుగుతోంది. గతంలో కంటే ఈసారి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు సన్న వడ్లు అధిక పరిమాణంలో వచ్చింది. సన్న, దొడ్డు వడ్లను వేర్వేరుగా నిల్వ చేసిన పౌరసరఫరాల అధికారులు వాటిని విడివిడిగా మిల్లింగ్‌ చేయిస్తున్నారు. సన్న, దొడ్డు రకం వడ్లను వేర్వేరుగా మిల్లింగ్‌ చేయడం ఇదే మొదటిసారి అని సివిల్ సఫ్లై అధికారులు చెబుతున్నారు. మిల్లింగ్‌లో సన్న ధాన్యానికే అధిక ప్రాధాన్యమిస్తున్నారు. ఈ సన్న బియ్యాన్ని రేషన్‌కార్డుదారులకు పంపిణీ చేసేందుకు రేవంత్ సర్కార్ రంగం సిద్ధం చేస్తోంది.

ఇదికూడా చదవండి…

బొప్పాయి ఆకులలో పోషక విలువలు