తాండూరు రియల్ ఏస్టేట్ వ్యాపారులకు సూపర్ ఛాన్స్
– ఎల్ఆర్ఎస్ స్కీంలో 25శాతం రాయితీతో లేఅవుట్ల క్రమబద్ధీకరణ
– మున్సిపల్లో ఎల్ఆర్ఎస్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు
– సద్వినియోగం చేసుకోవాలన్న మేనేజర్ నరేందర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని సామాన్యులతో పాటు రియల్ ఏస్టేట్ వ్యాపారులకు మున్సిపల్ అధికారులు సూపర్ ఛాన్స్ అందిస్తున్నారు. తాండూరు మున్సిపల్ పరిధిలో పెండింగ్ లో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి యంత్రాంగం దృష్టిసారించింది. మంగళవరాం మున్సిపల్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేశారు. అనమతి లేని ప్లాట్లు, అనుమతి లేని లేఅవుట్లు క్రమబద్దీకరించాలనే ఉద్దేశంలో ఎల్ఆర్ఎస్ స్కీమ్ ను అమలు చేస్తోంది. ఈనెల 31వ తేదిలోపు ఎస్ఆర్ఎస్ దరఖాస్తులపై ప్రభుత్వం 25 శాతం రాయితీ కల్పిస్తున్న సంగతి తెలిసిందే.

తాండూరు మున్సిపల్ పరిధిలో దాదాపు 12వేల 259 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని గతంలో అధికారులు వెల్లడించారు. వీలైనంత త్వరగా దరఖాస్తులను పరిష్కరించేందుకు కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మేనేజర్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం గతంలో రూ.1000లు చెల్లించిన దరఖాస్తులు దారులు రెగ్యులరైజ్ చేయించుకోవాలని సూచించారు. దీంతో పాటు రియల్ ఏస్టేట్ వ్యాపారులు ఏర్పాటు చేసిన వెంచర్లలలో 10శాతం ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయిన వారు కూడా మిగిలిన 90 శాతం ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందని స్పష్టం చేశారు.

ఈనెల 31వ తేది లోపు లేఅవుట్ల ఫీజులు చెల్లించి పరిష్కరించుకోవాలని సూచించారు. గడువు దాటితే ఫీజులు పెరిగే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు హెల్ప్ డెస్క్ అందుబాటులో ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది ఉన్నారు.
ఇదికూడా చదవండి…

