పసివాడి కోసం స్పందించిన బుయ్యని హృదయాలు
– మాస్టర్ వశిష్ట చికిత్సకు రూ.50వేల ఆర్థిక సాయం
– అందజేసిన ఆర్బీఓఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి, ఎండీ సరళా రెడ్డి దంపతులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : అరుదైన కాలేయ వ్యాధితో బాధపడుతున్న పసివాడి కోసం తాండూరుకు చెందిన కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, ఎండీ బుయ్యని సరళా శ్రీనివాస్ రెడ్డి దంపతులు స్పందించారు. బాలుడు చికిత్స కోసం రూ. 50వేల ఆర్థిక సాయం అందజేశారు. వివరాల్లోకి వెళితే… యాలాల మండలం సంగెం గ్రామానికి చెందిన శివకుమార్, భానుప్రియ దంపతుల కుమారుడు వశిష్ఠ (9నెలలు), అరుదైన కాలేయా వ్యాధి(బైలేరియా అట్రేసై)తో బాధడుతున్నాడు.

వ్యాధి నుంచి బాలుడిని కాపాడుకోవాలంటే కాలేయ మార్పిడి చేయాలని వైద్యులు నిర్ధారించారు. బాలుడుకు కాలేయాన్ని అందించేందుకు తండ్రి శివకుమార్ ముందుకు వచ్చారు. చెన్నైలోని ఓ ఆసుపత్రిలో నిర్వహించే చికిత్సకు రూ. 22లక్షలు ఖర్చు అవుతోంది. పేదరికంలో ఉన్న దంపతులు అంతమొత్తంలో ఖర్చు చేసేందుకు ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం విషయం తెలుసుకున్న ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, ఎండీ బుయ్యని సరళా శ్రీనివాస్ రెడ్డి దంపతులు తండ్రి శివకుమార్ కు రూ. 50వేల ఆర్థిక సాయం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాండూరు పెద్దలు, వ్యాపారస్తులు, ఉద్యోగులు, నాయకులు స్పందించి బాబు వైద్యం కోసం తోచినసాయం అందించాలి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి దంపతులు అందించిన సాయానికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువనాయకులు రొంపల్లి సంతోష్ కుమార్, జోషి వికాస్, విద్యావేత్త పర్యాద రామకృష్ణ తదితరులు ఉన్నారు.
ఇదికూడా చదవండి…

