మార్వాడీ మహిళల మంచి మనసు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

మార్వాడీ మహిళల మంచి మనసు..!
– మున్సిపల్ కార్మికులతో మహిళ దినోత్సవం
– వాళ్లతోనే ముందస్తు హోలీ సంబరాలు
– ఎంసీహెచ్లో బాలింతలకు పండ్లు, బాటిళ్ల పంపిణీ
– అభినందించిన మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మార్వాడీ మహిళా మండలి సభ్యులు మంచి మనసును చాటుకున్నారు. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పట్టణంలోని మున్సిపల్ మహిళ పారిశుద్ధ్య కార్మికులతో సంబరాలు జరుపుకున్నారు.

ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ తో కలిసి మహిళ మండలి సభ్యులు మహిళ దినోత్సవాన్ని ఉత్సాహాంగా జరుపుకున్నారు. అదేవిధంగా మహిళ కార్మికులకు వారి సంప్రదాయ పద్దతిలో ముందస్తు హోలీ సంబరాలను చేసుకున్నారు. రంగులు పూస్తూ.. శుభాకాంక్షలు తెలిపారు. మహిళ కార్మికులతో జరుపుకున్న హోలీ సంబరాలు ఆకట్టుకున్నాయి. అనంతరం వారికి పండ్ల బాక్సులతో పాటు కొత్త వాటర్ బాటిళ్లను బహుకరించారు. మరోవైపు మార్వాడీ మహిళ మండలి సభ్యులు పట్టణంలోని హైదరాబాద్ రోడ్డు మార్గంలో ఉన్న మాతా శిశు ఆసుపత్రికి చేరుకుని అక్కడ బాలింతలకు పండ్ల బాక్సులు, వాటర్ బాటిళ్లను అందజేశారు.

ఈ సందర్భంగా మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ మహిళ మండలి సభ్యులు చేసిన సేవను అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి, మాజీ కౌన్సిలర్ బంటారం లావణ్య, మార్వాడీ మహిళ మండలి సభ్యులు సీమా సార్డా, మాన్షీ పర్తాని, వర్షా సార్డా, నీతా బూబ్, హేమా సార్డా, మౌనిక అగర్వాల్, సోనల్ గగ్రాని, నమ్రత రాఠీ, స్వాతీ సార్డా, శ్వేతా బూబ్, ఆర్తీ బూబ్, జ్యోతి పండిట్, శివానీ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

వినాయకలో ఉమెన్స్‌ డే అదుర్స్..!