హెడ్ కానిస్టేబుల్ రాంచెందర్ ఇకలేరు..!
– గుండెపోటుతో కన్నుమూత
– విచారం వ్యక్తం చేసిన పోలీసులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు సబ్ డివిజన్ పరిధి కరణ్ కోట్ హెడ్ కానిస్టేబుల్ రాంచెందర్ కన్నుమూశారు. గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు. ఈ సంఘటన సోమవారం జరిగింది. తాండూరు పట్టణం సీతారాంపేట్ కు చెందిన రాంచందర్ పోలీసుశాఖలో పనిచేస్తున్నారు. గతంలో తాండూరు డీఎస్పీ కార్యాలయంలో రైటర్ గా విధులు నిర్వహించారు. ప్రస్తుతం రూరల్ పోలీస్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేసేవారు.

గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యానికి గురికావడంతో కుటుంబీకులు ఆసుపత్రిలో చేర్పించారు. గుండె సంబంధిత వ్యాధులు రావడంతో స్టంట్ లు వేశారు. సోమవారం మళ్లీ పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ తరలించారు. మార్గ మద్యలో రాంచందర్ కన్నుమూశారు. ఈ సంఘటనపై తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, సీఐలు నగేష్, సంతోష్ కుమార్ లతో పాటు ఎస్ఐలు, పోలీసు సిబ్బంది విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈరోజు మధ్యాహ్నం 3-30గంటలకు పట్టణంలోని ఆర్యవైశ్య ఘాట్లో దహన సంస్కారాలు నిర్వహించడం జరుగుతుందని కుటుంభీకులు తెలిపారు.

ఇదికూడా చదవండి…

