మంత్రి శ్రీ‌నివాస్‌గౌడ్‌ను ప‌రామ‌ర్శించిన ఎమ్మెల్సీ మహేంద‌ర్ రెడ్డి

తాండూరు మహబూబ్ నగర్ రాజకీయం హైదరాబాద్

మంత్రి శ్రీ‌నివాస్‌గౌడ్‌ను ప‌రామ‌ర్శించిన ఎమ్మెల్సీ మహేంద‌ర్ రెడ్డి
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు
శాఖలకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి ప‌రామ‌ర్శించారు. ఇటీవ‌లే మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్ మాతృ వియోగానికి గురైన విష‌యం తెలిసిందే. ఈ విష‌యం తెలిసి మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి మహబూబ్ నగర్ లోని ఆయన నివాసానికి వెళ్లారు. అక్క‌డ మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్ త‌ల్లి శాంతమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. శాంతమ్మ‌ ఆత్మకు భగవంతుడు శాంతిని ప్రసాదించాలని ఆకాంక్షించారు.