పనికోసం వచ్చి హత్యకు గురైంది..!
– మృతురాలి ఆచూకీని కనిపెట్టిన పోలీసులు
– నిందితుల కోసం ముమ్మర విచారణ
పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : పనికోసం ఇంటినుంచి వచ్చిన ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. పెద్దేముల్ మండలంలో రెండు రోజుల క్రితం హత్యకు గురైన మహిళ ఆచూకీని పోలీసులు కనిపెట్టారు. బుధవారం పెద్దేముల్ గ్రామ శివారులోని ఓ నీటి గుంతలో సుమారు 35 ఏండ్లు ఉన్న మహిళ హత్యకు గురైన సంగతి తెలిసిందే. రెండు రోజుల నుంచి పోలీసులు సామాజిక మాధ్యమాలలో, ఇతర విధాలుగా ప్రచారం చేసి.. ఆచూకీ కోసం ఆరా తీశారు.

తాజాగా శుక్రవారం మృతి చెందిన మహిళ ఆచూకీని పోలీసులు గుర్తించారు. వికారాబాద్ జిల్లా బొంరాస్పేట్ మండల్ చౌదర్పల్లి గ్రామానికి చెందిన యశోద గా గుర్తించారు. మృతి చెందిన యశోదను పెద్ద కుమారుడు ఈ విషయాన్ని నిర్ధారించినట్టు పోలీసులు తెలిపారు. గ్రామానికి చెందిన యశోధ పనికోసం ఇంటి నుంచి వచ్చినట్లు కుటుంబీకులు తెలిపారని పోలీసులు వెల్లడించారు. మృతురాలి ఆచూకీ లభించినప్పటికి హంతకుల కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుని క్రైం మిస్టరీని చేధిస్తామని పోలీసులు తెలిపారు. కాగా రెండు రోజుల క్రితం జరిగిన మహిళ హత్య ఈ సంఘటన పెద్దేముల్ మండలంలో కలకలం రేపింది.

ఇదికూడా చదవండి…

