స్ట్రాంగ్ సెక్యూరీటీ..!

తాండూరు రాజకీయం వికారాబాద్

స్ట్రాంగ్ సెక్యూరీటీ..!
– రూం వద్ద సీసీ కెమెరాల నిఘా
– కట్టుదిట్టమైన భద్రత చర్యలు
– తాండూరు ఆర్డీఓ శ్రీనివాస్ రావు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గ పార్లమెంట్ ఎన్నికల స్ట్రాంగ్ రూంకు స్ట్రాంగ్ సెక్యూరిటీ ఏర్పాటు చేసినట్లు సహాయ ఎన్నికల అధికారి, ఆర్డీఓ శ్రీనివాస్ రావు తెలిపారు. బుధవారం తాండూరు పట్టణం సెయింట్ మార్క్స్ స్కూల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంను ఆర్డీఓ శ్రీనివాస్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తాండూరు నియోజకవర్గానికి సంబంధించి ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్ లు వచ్చాయని’ తెలిపారు.

వాటిని స్ట్రాంగ్ రూంలో భద్రపర్చడం జరిగిందన్నారు. స్ట్రాంగ్ రూం వద్ద పోలీసు సిబ్బంది. పారా మిలిటరీ బృందం ద్వారా బందోబస్తుతో’ పాటు సీసీ కెమెరాల నిఘా ఏర్పాటుతో కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ తారాసింగ్, అధికారులు మాణిక్ రావు, చాంద్ పాష, విజయేందర్ తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

106 మంది ప్రభుత్వ ఉద్యోగుల సస్పెండ్‌