సీఎంఆర్ఎఫ్ పేదలకు భరోసా

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

సీఎంఆర్ఎఫ్ పేదలకు భరోసా
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– బాధిత కుటుంబానికి ఎల్వోసీ అందజేసిన ఎమ్మెల్యే
తాండూరు, దర్శిని ప్రతినిధి : అనారోగ్యంతో బాధపడే పేదలకు సీఎంఆర్ఎఫ్ పథకం భరోసాగా నిలుస్తుందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. తాండూరు నియోజకవర్గం యాలాల మండలం బెన్నూర్ గ్రామానికి చెందిన యు.వెంకటేష్ కొంతకాలంగా కండరాల సమస్యతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు.

వైద్య ఖర్చుల కోసం సీఎంఆర్ఎఫ్ దరఖాస్తు చేసుకోగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో బాధితునికి రూ. 1 లక్ష 50వేలు మంజూరయ్యాయి. ఈ మేరకు శనివారం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేతుల మీదుగా బాధిత కుటుంబానికి ఎల్టిసీను -అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్యానికి గురై వైద్య ఖర్చులు భరించలేని పేదలు సీఎంఆర్ఎఫ్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యాలాల మండల యువనాయకులు వికాస్ జోషి, ఏఎంసీ మాజీ డైరెక్టర్ తిమ్మాయిపల్లి రాజు, సీనీయర్ నాయకులు తదితరులు ఉన్నారు.

ఇది కూడా చదవండి….

ఉయ్యాలో.. ఉయ్యాలా..!