రజతోత్సవ సభను విజయవంతం చేద్దాం

తాండూరు రాజకీయం వికారాబాద్

రజతోత్సవ సభను విజయవంతం చేద్దాం
– వరంగలు భారీగా తరలి వెళదాం
– 27న గ్రామ గ్రామాన బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలి
– తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు భారీగా తరలివెళ్లి విజయవంతం చేద్దామని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం తాండూరు పట్టణంలోని రోహిత్ రెడ్డి నివాసంలో యాలాల, పెద్దేముల్, తాండూరు మండలాల ముఖ్య నాయకులతో రజతోత్సవ సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రోహిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వరంగల్ సభ పోస్టర్ ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా రోహిత్ రెడ్డి మాట్లాడుతూ వరంగల్లో ఏర్పాటు చేసిన సభకు పార్టీ నేతలు సొంత వాహనాలలో భారీగా తరలివెళ్లామని అన్నారు. తాండూరు నుంచి భారీగా తరలివెళ్లి జయప్రదం చేయాలని అన్నారు. అదేవిధంగా ఈనెల 27న బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా తాండూరు పట్టణం, మండలాల్లోని ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ జెండాలు ఆవిష్కరించాలన్నారు. పార్టీ నాయకులు నిత్యం ప్రజల్లో ఉండాలని, మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండలాల అధ్యక్షులు వీరేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, మహిళ నాయకురాలు శకుంతల దేశ్ పాండే, పటేల్ ఉమా శంకర్, మాజీ సర్పంచ్ శివకుమార్, రమేష్, శంశోద్దీన్, రాకేష్ గౌడ్, వివిధ మండలాల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి….

పత్తి రైతులను పల్టీ వేసే ప్లాన్..!