పేదల ఆరోగ్య సేవలో వినాయక ఆసుపత్రి
– ఉచిత వైద్య శిబిరాలతో వైద్య సేవలు
– ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణ
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం శాంతినగర్ లోని వినాయక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పేదలకు ఆరోగ్య సేవలను అందిస్తోంది. వరుసగా ఉచిత వైద్య శిబిరాల నిర్వహణతో ప్రజలలో మంచి ఆదరణ దక్కించుకోంటోంది. తాజాగా కోడంగల్ నియోజకవర్గం కొత్తపల్లి మండలం తిమ్మారెడ్డి పల్లి లో సద్గురు సంత్ శ్రీ గురు లోకామసంద్ మహరాజ్ దేవస్థానం బావోజి జాతర బ్రహ్మోత్సవాలు గిరిజన జాతరలో మాజీ మార్కెట్ చైర్మన్ తాండూర్ విఠల్ నాయక్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది.

ఈ మెడికల్ క్యాంపులో డాక్టర్ రవీందర్ నాయక్, డాక్టర్ చందులాల్ నాయక్,, మోతిలాల్ నాయక్, సిబ్బంది పాల్గొన్నారు. ఈ శిబిరంలో పేదలకు జ్వరం, దగ్గు, బీపీ, షుగర్ తదితర ఆరోగ్య పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. మెడికల్ క్యాంప్ నిర్వహించడం వల్ల బావోజి జాతర కు వచ్చిన భక్తులు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ఈ నాలుగు రాష్ట్రాల గిరిజన భక్తులు మెడికల్ క్యాంప్ ని వినియోగించుకున్నారు. ఆసుపత్రి బృందం గిరిజనుల కోసం వైద్య శిబిరం ఏర్పాటు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
ఇదికూడా చదవండి…

