ముర్షద్ దర్గా రోడ్డుకు మహర్దశ..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ముర్షద్ దర్గా రోడ్డుకు మహర్దశ..!
– ఎమ్మెల్యే సహాకారతంతో సీసీ రోడ్డు
– త్వరలోనే సెంట్రల్ లైటింగ్ వ్యవస్థ
– కృతజ్ఞతలు తెలిపిన మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని ముర్షద్ దర్గా – చెన్ గెష్ పూర్ రోడ్డుకు స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో మహర్దశ వస్తోందని మున్సిపల్ మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల అన్నారు. గురువారం మున్సిపల్ అధికారులు రోడ్డు పనులను పరిశీలించారు. ఈ పనులను జుబేర్ లాల కూడా సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చొరవతో ముర్షద్ దర్గా – చెన్ గెష్ పూర్ రోడ్డు సీసీ రోడ్డు వేయడం జరుగుతుందన్నారు. దీంతో పాటు రూ. 1కోటి 60 లక్షలతో సెంట్రల్ లైటింగ్ వ్యవస్థ ఏర్పాటు కాబోతుందని తెలిపారు. రోడ్డు అభివృద్ధికి దృష్టిసారించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గురువారం మున్సిపల్ అధికారులు ఈ మార్గంలోని విద్యుత్ స్థంబాల తరలింపు పనులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఏఈ ఖాజా హుస్సేన్, అధికారులు, సిబ్బంది ఉన్నారు.

ఇది కూడా చదవండి….

గ్రేట్ రిజల్ట్స్‌కు కేరాఫ్ శ్రీ నేతాజీ గురుకుల్ స్కూల్