వైద్య ఆరోగ్యానికి స‌ర్కారు పెద్ద‌పీట‌

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

వైద్య ఆరోగ్యానికి స‌ర్కారు పెద్ద‌పీట‌
– ఆరోగ్య మేళాల‌ను ప్ర‌జ‌లు స‌ద్వినియోగం చేసుకోవాలి
– 30 పడ‌క‌ల‌తో పెద్దేముల్ ఆసుప‌త్రి ఆధునీక‌ర‌ణ‌
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
పెద్దేముల్, ద‌ర్శిని ప్ర‌తినిధి: పేద‌ల వైద్య ఆరోగ్యానికి స‌ర్కారు పెద్ద‌పీట వేసింద‌ని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. సోమ‌వారం తాండూరు నియోజ‌క‌వ‌ర్గం పెద్దేముల్ మండ‌ల కేంద్రంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య మేళాను ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజ‌రై ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ పేద‌, మ‌ద్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు కార్పోరేట్ స్థాయి వైద్యం అందించాల‌ని ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ప్ర‌త్యేక దృష్టిసారిస్తున్నార‌ని అన్నారు. ఇందులో భాగంగా డివిజ‌న్ల వారిగా ఆరోగ్య మేళాల‌ను నిర్వ‌హిస్తున్నార‌ని అన్నారు. ఆరోగ్య మేళాల‌ను ప్ర‌జ‌లు స‌ద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా పెద్దేముల్ మండ‌ల కేంద్రంలోని ఆసుప‌త్రిని 30 ప‌డ‌క‌ల ఆసుప‌త్రిగా మార్చి ఆధునీక‌రిస్తామ‌న్నారు. మండ‌లంలో మ‌రో 3 స‌బ్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేస్తామ‌ని పేర్కొన్నారు. అనంత‌రం ఆరోగ్య మేళాల‌లో వైద్యులు అందించే సేవల‌పై ఆరా తీశారు. ప్ర‌జ‌ల‌కు మెరుగైన వైద్య సేవ‌లు అందించాల‌ని సూచించారు. ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా వైద్యాధికారి తుకారాం, ఎంపీపీ అనురాధ రమేష్, మండల పార్టీ అధ్యక్షుడు కోహిర్ శ్రీనివాస్, మాజీ అధ్యక్షుడు నారాయణ రెడ్డి, సర్పంచ్లు విజయమ్మ, శ్రావణ్‌, పాండు, ఎంపిటిసిలు ప్రవీణ్ పటేల్, అంబ్రయ్య, వెంకట్ రెడ్డి, రమేష్, శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రంగయ్య తదితరులు పాల్గొన్నారు.