తాండూరు, ఆగస్టు 15 (దర్శిని) : తాండూరు ఆర్డీఓ అశోక్ కుమార్‌ను మున్సిపల్ ప్రతిపక్ష కౌన్సిలర్లు ఘనంగా సన్మానించారు. ఆదివారం తాండూరు ఆర్డీఓకు ఉత్తమ అవార్డును ప్రకటించారు. ఆర్డీఓ మున్సిపల్ ఇంచార్జ్ కమీషనర్‌గా వ్యవహరిస్తుండడంతో ప్రతిపక్ష కౌన్సిలర్లు ఆర్డీఓను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు, కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, ఫ్లోర్ లీడర్ వరాల శ్రీనివాస్ రెడ్డి, టీజేఏస్ ఫ్లోర్ లీడర్ సాంబూరు సోమశేఖర్, సీపీఐ ఫ్లోర్ లీడర్ ఆసీఫ్‌లు ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని ఆయను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ యువనాయకులు నాగు, తదితరులు ఉన్నారు.