సర్కారు బడికి ఆటవస్తువుల వితరణ
– విద్యాశాఖ మంత్రి సోదరుడు నర్సింహారెడ్డి(బాబు) ధాతృత్వం
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: తాండూరు మండలం కోటబాస్పల్లిలోని ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి సోదరుడు, తాండూరు సీటీకేబుల్ ఎండి, స్వర్గీయ మాజీ హోం మంత్రి ఇంద్రారెడ్డి ట్రస్ట్ చైర్మన్ నర్సింహారెడ్డి(బాబు) చేయూతనందించారు. శుక్రవారం గ్రామంలోని పాఠశాలకు రూ. 1లక్షకు పైగా విలువైన ఆట
వస్తువులను బహుకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నర్సింహారెడ్డి(బాబు) మాట్లాడుతూ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి తోడ్పాటు అందించి.. పాఠశాలను ఆదర్శంగా తీర్చి దిద్దేందుకు సహాకారం అందిస్తామని అన్నారు. దీంతో పాటు గ్రామంలో తల్లిదండ్రులు లేని విద్యార్థుల చదువులకు ఆర్థిక సహాయం అందిస్తామని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు సమయ పాలనతో విద్యార్థులకు గుణాత్మక విద్యనందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నాగప్ప, కిష్టప్ప, నర్సిరెడ్డి తో పాటు వెంకట్ రామ్ రెడ్డి ,రవీందర్ రెడ్డి కోట్రిగా కిరణ్, మాజీ వైస్ ఎంపీపీ మొగలప్ప, శేఖర్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
తండ్రికి నివాళులు
మరోవైపు తన తండ్రి తాండూరు మాజీ ఎంపీపీ స్వర్గీయ గొట్టిగ మహిపాల్ రెడ్డికి నర్సింహారెడ్డి(బాబు) నివాళులు
అర్పించారు. శుక్రవారం గ్రామంలోని సృతి వనంలో మహిపాల్ రెడ్డి 11వ వర్దంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సింహారెడ్డి తన తండ్రి సమాధి వద్ద పూజలు నిర్వహించి… పూలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం తాండూరు మండల అభివృద్ధికి తండ్రి మహిపాల్ రెడ్డి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మిత్రులు రవీందర్ రెడ్డి, పీఆర్టీయూ నాయకులు కిష్టప్ప, నర్సిరెడ్డి, వెంకట్ రామ్ రెడ్డి ,రవీందర్ రెడ్డి కోట్రిగా కిరణ్, మాజీ వైస్ ఎంపీపీ మొగలప్ప, శేఖర్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

