వీరశైవ సమాజంకు చీఫ్ విప్ చేయూత
– ఫంక్షన్‌హాల్ రెనవేషన్‌కు ఆర్థిక సాయం
– మహేందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన సమాజం సభ్యులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని వీరశైవ సమాజం సభ్యులకు తెలంగాణ రాష్ట్ర చీఫ్ విప్ పట్నం మహస్త్రందర్ రెడ్డి చేయూత అందించనున్నట్లు ప్రకటించారు. ఇటీవల అగ్నిప్రమాదానికి గురైన వీరశైవ సమాజ్ కళ్యాణ మండపాన్ని శుక్రవారం తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి సందర్శించారు.

టీపీసీసీ ప్రచార కమిటీ కరణం పురుషోత్తం రావు, సీనియర్ నాయకుడు డాక్టర్ సంపత్ ల తోపాటు వీరశైవ సమాజ్ గౌరవ అధ్యక్షుడు వాలి శాంత కుమార్ అధ్యక్షుడు ఆర్ బసవరాజ్, ప్రధాన కార్యదర్శి రవికుమార్ లతో కలిసి కళ్యాణమండపంలో ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఘటనకు సంబంధించి వివరాలను తెలుసుకున్నారు. ప్రమాదానికి సంబంధించి పోలీసు ఫిర్యాదులు, పునర్నిర్మాణానికి అవసరమైన అంశాలను వీరశైవ సమాజం నాయకులతో చర్చించారు.

అనంతరం ఫంక్షన్ హాల్ పునర్ నిర్మాణం కోసం రూ. 20 లక్షలు అందిస్తానని ప్రకటించారు. గతంలో మహేందర్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు నిర్మాణాల, సీసీ రోడ్లు , విద్యార్థులకు శిక్షణ కోసం సుమారుగా 25 లక్షలు అందించినట్లు వీరశైవ సమాజ్ నాయకులు గుర్తు చేశారు. తాజాగా ఆర్థిక సాయం ప్రకటించడం పట్ల చీఫ్ విప్ మహేందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరశైవ సమాజం నాయకులు తంబాకు చంద్రశేఖర్, గణపురం శంకర్, దిబ్బల్లి గౌరీ శంకర్, నిర్ణి చంద్రశేఖర్, బీదర్ శేఖర్, గంగ శ్రావణ్, వాలి శ్రవణ్, యువజన దళ్ అధ్యక్ష కార్యదర్శులు శశాంక్, ఎం. చంద్రశేఖర్, సీనియర్ నాయకులు బిర్కిట్ రఘు, కాంగ్రెస్ పార్టీ కార్మిక విభాగం అధ్యక్షుడు పునీత్, పట్టణ అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్ తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

