వీరశైవ సమాజానికి అండగా ఉంటాం

తాండూరు రాజకీయం వికారాబాద్

వీరశైవ సమాజానికి అండగా ఉంటాం
– ఫంక్షన్ హాల్ మరమ్మత్తులకు సహాకారం
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని వీరశైవ సమాజంకు అండగా ఉంటామని స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. రెండు రోజుల క్రితం తాండూరులోని వీరశైవ సమాజంకు చెందిన ఫంక్షన్ హాల్ షాక్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.

శనివారం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సమాజం సభ్యులతో కలిసి ఫంక్షన్ హాల్ను సందర్శించారు. ప్రమాదంకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఫంక్షన్ హాల్ ద్వారా వీరవైశ సమాజంకు చెందిన నిరపేదల కోసం సేవలు అందించడం అభినందనీయమని అన్నారు. షాక్ సర్క్యూట్ తో ఫంక్షన్ హాల్ అగ్ని ప్రమాదానికి గురికావడం బాధాకరమన్నారు. వీరశైవ సమాజంకు అండగా ఉంటామని అన్నారు. ఫంక్షన్ హాల్ మరమ్మత్తులకు సహాకారం అందిస్తామన్నారు.

ఇందుకు సమాజం సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భద్రేశ్వర దేవాలయ రెనవేషన్ కమిటి చైర్మన్ పటేల్ కిరణ్ కుమార్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, మాజీ ఫ్లోర్ లీడర్ లింగదలి రవికుమార్, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, సమాజం పెద్దలు ఆర్.బస్వరాజ్, వాలి శాంతుకుమార్, జొన్నల బస్వరాజ్, గాజుల శాంతుకుమార్, నాయకులు కావలి సంతోష్ కుమార్, బంటు వేణు, యువదళ్ సభ్యులు తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

స్థానికం.. దగ్గరగా.. దూరంగా..!