కేవీసీఎస్లో యోగా దినోత్సవం..!
– ఉత్సహాంగా పాల్గొన్న టీచర్లు, విద్యార్థులు
– యోగా స్పూర్తి నింపిన ఆసనాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పాఠశాల ఆవరణలో యోగా గురువు ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో యోగసానాలు వేశారు.

స్కూల్ ప్రిన్సిపల్ ప్రశాంత్, డైరెక్టర్ సతీష్ తో పాటు టీచర్లు, విద్యార్థులు యోగాసనాలు వేశారు. చిన్నారులు, విద్యార్థులు వేసిన యోగాసనాలతో పాఠశాల ప్రాంగణం కిక్కిరిసింది. యోగా గురువు ఒక్కో ఆసనం వేస్తూ వాటి ప్రాముఖ్యతను తెలియజేశారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ప్రశాంత్ మాట్లాడుతూ భారతదేశంలో యోగా 5వేల ఏండ్ల క్రితమే ప్రాచీనంలో ఉందని తెలిపారు. యోగా ఆసనాలు వేయడం ద్వారా శారీరక శక్తి, ప్రశాంతత సిద్దిస్తుందన్నారు. మనిషి ఆరోగ్యంగా జీవిస్తూ అనేక విజయాలను అందుకునేందుకు యోగా దోహద పడుతుందని అన్నారు. యోగా ప్రాముఖ్యతను గుర్తించే ప్రతి యేడాది జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నామని వివరించారు. ప్రతి రోజూ అందరు 30 నిమిషాల పాటు యోగా వేసే అలవాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

