జిల్లా ఆసుపత్రికి ఐసీయూ…!

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

జిల్లా ఆసుపత్రికి ఐసీయూ…!
– త్వరలో ఏర్పాటుకు కసరత్తు
– ఎమర్జెన్సీ కేసులకు ఇక్కడే ట్రీట్ మెంట్
– నిర్వహణకు ప్రత్యేక వైద్యులు, సిబ్బంది
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరు నియోజకవర్గంలోని పేద ప్రజలకు శుభవార్త. తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుప్రతిలో రిస్క్‌ కేసులకు ఇక్కడే భరోసా కల్పించే వైద్య సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. తాండూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్(ఐ సీయూ) ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు.

తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రత్యేక దృష్టితో త్వరలో అందుబాటులోకి తీసుకవచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాండూరులో 200 పడకలతో కూడిన ఆసుపత్రితో పాటు హైదరాబాద్ రోడ్డు మార్గంలోని మాతా శిశు ఆసుపత్రిలో పేదలకు వైద్య సేవలు అందుతున్నాయి. వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్న గర్, నారాయణపేట్ జిల్లాలు, సరిహద్దు కర్ణాటక రాష్ట్రాని చెందిన రోగులకు సైతం ఇక్కడి ఆసుపత్రి సేవలను వినియోగించుకుంటున్నారు.

ఇటీవల వికారాబాద్లో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ నిర్వహించిన సమీక్ష సందర్భంగా జిల్లా ఆస్పత్రిలో ఐసీయూ లేకపో పడం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఐసీయూ ఏర్పాటుకు వెంటనే ప్రతిపాదనలు పంపించాలని అధి కారులను ఆదేశాలు ఇచ్చారు. ఆ మేరకు ఐసీయూ ఏర్పాటుకు అధికారులు చర్యలకు ఉపక్రమించారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో మరిన్ని సౌకర్యాలు కల్పించాలని డిప్యుటీ సీఎం, వైద్యారోగ్య శాఖ మంత్రు లకు విజ్ఞప్తి చేశారు. ఐసీయూ ఏర్పాటు, అవసరం మేరకు వైద్యుల నియామకం, మందుల సరఫరా వంటి వాటిపై ఎమ్మెల్యే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.

అందుబాటులోకి వస్తే అందసేవలు
సాధారణంగా తీవ్ర ఆరోగ్య సమస్యలున్న వారు, తీవ్ర గాయాలైన వారు, ప్రత్యేక వైద్యం అవసరమైన వారు, గుండె, మూత్రపిండాల వ్యాధిగ్రస్తులు, తీవ్ర ఇన్ఫెక్షన్ సోకిన వారు ఐసీయూల్లో చేరతారు. ఇక్కడ ఐసీయూ ఏర్పాటుతో 24గంటలూ వైద్యులు, సిబ్బంది ఉంటారు. ఐసీయూలో తక్కువ పడకలుంటాయి. ప్రతీ బెడ్ వద్ద వెంటిలేటర్ వంటి అధునాతన వైద్యపరికరాలు అమర్చుతారు. ప్రతి రోగికి నర్సును ఏర్పాటు చేస్తారు. అంటు వ్యాధులు సోకిన వారిని ఐసీయూలోనే ‘ఐసోలే షన్’ వార్డులో అడ్మిట్ చేస్తారు. ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో బాధితులకు మెరుగైన వైద్య సేవలను అందిస్తారు.

ఇదికూడా చదవండి…

కంకటి.. శ్రీనివాసుడి అవినీతి..!