బాబు.. బంగారం మాస్కు..!

జాతీయం తెలంగాణ

బాబు.. బంగారం మాస్కు..!
– రూ. 5.70ల‌క్ష‌ల ఖ‌రీదు
ద‌ర్శ‌ని బ్యూరో : క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల్ల అంద‌రికి మాస్కుల వినియోగం త‌ప్ప‌నిస‌రై పోయింది. గ‌త రెండేళ్లపైగా దేశ వ్యాప్తంగా మాస్కుల వినియోగం కొన‌సాగుతుంది. మాస్కుల వినియోగం అనివార్యం కావ‌డంతో ప్ర‌జ‌లు త‌మ అభిరుచికి త‌గ్గ‌ట్టు మాస్కుల‌ను వినియోగం మొద‌లు పెట్టారు. దీంతో వినూత్నంగా త‌యారు చేసిన మాస్కుల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ప్ర‌స్తుతం పశ్చిమ బెంగాల్ కు చెందిన ఓ వ్యాపారవేత్త పసిడి మాస్కు ధరించిన మాస్కు గురించి అంద‌రు చ‌ర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఆయ‌న బంగారంతో త‌యారు చేయించిన మాస్కును ధ‌రించ‌డం గ‌మ‌నార్హం. చందన్ దాస్ అనే నగల డిజైనర్ సాయంతో ఆ వ్యాపారి తనకిష్టమైన విధంగా బంగారంతో ఆ మాస్కును తయారుచేయించుకున్నారు. ఇందుకోసం 108 గ్రాముల బంగారాన్ని వినియోగించారు. దీని ఖరీదు రూ.5.70 లక్షలు. కోల్ కతాలో దుర్గాపూజ సందర్భంగా ఈ గోల్డెన్ మాస్కుతో వచ్చిన వ్యాపారవేత్తను చూసేందుకు జనం ఎగబడ్డారట.