వర్షానికి కూలిన ఇళ్లు…!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్


వర్షానికి కూలిన ఇళ్లు…!

– ఆదుకోవాలని కోరుతున్న యజమాని
– అంతారం గ్రామంలో ఘటన
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు ప్రాంతంలో కురుస్తున్న వర్షాలు ప్రజలకు ఇబ్బందుల పాలు చేస్తున్నాయి. వీధుల్లో, రోడ్లపై వరధనీరు చేరడంతో రాకపోకలు ఇబ్బందులు ఎదరవుతున్నాయి. పలువురు నివాసాల్లోకి వరద నీరు చేరడంతో అందరు బిక్కు బిక్కుమంటున్నారు.

తాండూరు మండలం అంతారం గ్రామంలో ఓ ఇల్లు కూలిపోయింది. గత రెండు, మూడు రోజులుగా తాండూరు మండలంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో తాండూరు మండలం అంతారం గ్రామానికి చెందిన తాండ్ర ఏసుకు అనే వ్యక్తికి చెందిన పాక్షికంగా కూలిపోయింది. మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి ఇంటి గోడల్లో తంపు చేరుకుంది. గోడ పూర్తిగా తడిపోయి పాక్షికంగా కూలిపోయింది. ఈప్రమాదంలో ఎవ్వరికి ఎలాంటి ప్రాణహాని జరగలేదు. అయితే ఇల్లు పోయిన యజమాని తాండ్ర ఏసు మాట్లాడుతూ ఇల్లు కూలడంపై విచారం వ్యక్తం చేశారు. పేదరికానికి చెందిన తమకు ప్రభుత్వమే పరిహారం అందించి ఆదుకోవాలని అధికారులను, నాయకులను కోరారు.

ఇదికూడా చదవండి…

సార్.. నేను మా నాన్నను చంపేశా..!