రైట్.. రైట్.. బీదర్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

రైట్.. రైట్.. బీదర్..!
– వయా పెద్దేముల్ మీదుగా బస్సు సర్వీస్
– ఎమ్మెల్యే మనోహరన్న చొరవతో స్ట్రార్ట్
– హర్షం వ్యక్తం చేసిన పెద్దేముల్ కాంగ్రెస్ నేతలు
పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : తాండూరు నుంచి పెద్దేముల్ మీదుగా బీదర్‌ వెళ్లే భక్తులకు, నియోజకవర్గ ప్రయాణికులకు ఆర్టీసీ బస్సు సర్వీసును కల్పించింది. స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రత్యేక చొరవతో పెద్దేముల్ మీదుగా బీదర్ పుణ్య క్షేత్రానికి ఆర్టీసీ బస్సు సర్వీసు ప్రారంభయ్యింది.

శుక్రవారం పెద్దేముల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బస్సు కు పూజలు నిర్వహించి ప్రారంభించారు, గతంలో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు ఆర్టిసి డిపోకు వెళ్లినప్పుడు తాండూరు పట్టణం నుండి బీదర్ పుణ్య క్షేత్రనికి వెళ్లడానికి బస్సు సర్వీసును ప్రారంభించాలని అంతర్ రాష్ట సర్వీను తాండూరు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోకీ తీసుకురావాలని తాండూరు డిపో మేనేజర్ సురేష్ తో, రీజినల్ మేనేజర్ తో మాట్లాడారు. తాండూరు పట్టణం నుండి బీదర్ వరకు బస్సు సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యే ఆదేశించడంతో శుక్రవారం నుంచి బీదర్ ఆర్టీసీ బస్సు సర్వీసు అందుబాటులోకి వచ్చింది.

తాండూర్ నుండి ఉదయం 6 గంటలకు, మధ్యానం 1-30 కు, బీదర్ నుండి తాండూరు కు ఉదయం 9-30 . సాయంత్రం 5 గంటలకు బస్సు సౌకర్యం అందుబాటులో ఉంచుతున్నారు. ఈ సందర్‌భంగా టిపిసిసి మైనార్టీ రాష్ట కన్వీనర్ యం.డి.రియాజ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపధ్యక్షుడు నల్ల ఎల్లారెడ్డి తదితరులు మాట్లాడుతూ తాండూరు డిపో నుండి బీదర్ వరకు వయా పెద్దేముల్, కుంచారం, జహిరబాద్ మీదుగా బస్సు సౌకర్యం కల్పించడం వల్ల పెద్దేముల్, బంటారం, ధారూర్, కుంచవారం, తదితర మండల ప్రలకు సౌకర్యంగా ఉంటుందని సంతోషం వ్యక్తం చేశారు. నియోజకవర్గం లోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి సూచించారు. ఈ కార్యక్రమంలో నాగులపల్లి గడ్డం శేఖర్ పటేల్, శ్రీను, ఎర్ర రవి, డి.వై.అరవింద్, పడగల రాజు తదిరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి..

హిందూవులారా తరలిరండి..!