పేదల ఆరోగ్యానికి భరోసా..!
– సీఎంఆర్ఎఫ్‌ను సద్వినియోగం చేసుకోవాలి
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– 170 మందికి ఎల్వోసీలు అందజేసిన ఎమ్మెల్యే
తాండూరు, దర్శిని ప్రతినిధి : పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ పథకంతో భరోసా అందిస్తోందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు.

శనివారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ ఎల్‌ఓసీల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేతుల మీదుగా తాండూరు నియోజకవర్గంలోని బషీరాబాద్, యాలాల, పెద్దేముల్, తాండూరు, తాండూరు పట్టణంతో పాటు కోట్ పల్లి మండలాలకు చెందిన 170 మందికి మంజూరైన రూ.56లక్షల 60వేల విలువైన సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసీలను లబ్దిదారులకు అందజేశారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అనారోగ్యానికి గురైన పేదలు ప్రైవేటు, కార్పోరేట్ ఆసుపత్రులలో వైద్యం చేయించుకునేందుకు ఇబ్బందులు పడవద్దని ఉద్దేశంతో సీఎంఆర్ఎఫ్ పథకంతో ఆర్థిక భరోసా అందిస్తోందని అన్నారు. ప్రభుత్వం ఈ పథకంతో పేదలకు కార్పోరేట్ వైద్యం అందించేందుకు చేయూతను అందిస్తోందన్నారు. అర్హులైన పేదలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో డీసీసీబీ జిల్లా వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, కోట్ పల్లి మార్కెట్ కమిటి చైర్మన్ అంజయ్య, వైస్ చైర్మన్ నారాయణ రెడ్డి, తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, పెద్దేముల్ మాజీ వైస్ ఎంపీపీ మధులత శ్రీనివాస్ చారి, యాలాల పీఏసీఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, సీనీయర్ నాయకులు గాజీపూర్ నారాయణ రెడ్డి, శరణు బసప్ప, మాజీ కౌన్సిలర్లు పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి, ప్రభాకర్ గౌడ్, జుబేర్ లాల, బోయరవి, మాజీ ఎంపీటీసీ రాజ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు హబీబ్ లాల, మండల అధ్యక్షులు జన్నె నాగప్ప, భీమప్ప, అజయ్ ప్రసాద్, అనిల్ కుమార్ గౌడ్, వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి..

