భక్తిశ్రద్దలతో కార్తీక దీపారాధన
– దీపాలను వెలిగించిన కౌన్సిలర్ సంగీత ఠాకూర్
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణం గాంధీనగర్‌లోని మైసమ్మ దేవాలయంలో భక్తిశ్రద్దలతో కార్తీక దీపారాధన చేపట్టారు. మంగళవారం కార్తీక మాసం ద్వాదశిని పురస్కరించుకుని అమ్మవారి ఆయంలో బీజేపీ కౌన్సిలర్
సంగీత అజయ్ సింగ్ ఠాకూర్ ఆధ్వర్యంలో దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. కౌన్సిలర్ సంగీత ఠాకూర్‌తో
పాటు మహిళ భక్తులు ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని భక్తి శ్రద్దలతో కార్తీక దీపాలను వెలగించారు. అనంతరం అమ్మవారిని కీర్తీస్తూ భక్తిగీతాలను ఆలాపించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ సంగీత ఠాకూర్ మాట్లాడుతూ కార్తీక మాసం సందర్భంగా దీపారాధన చేసి ప్రజలకు అమ్మవారి కృప ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తూ మొక్కులు తీర్చుకున్నట్లు పేర్కొన్నారు.
