ముదిరాజ్‌ల గుర్తింపుకు ఐక్యంగా పోరాడాలి
– తాండూరులో కృష్ణస్వామి జయంతి ఉత్సవాలు
– ముదిరాజ్ మహాసభ జెండా ఆవిష్కరణ
తాండూరు, దర్శిని ప్రతినిధి: ముదిరాజ్‌లకు సమాజంలో సముచిత స్థానం కల్పించేందుకు ఐక్యంగా ఉద్యమించాలని తాండూరు ముదిరాజ్ మహాసభ నాయకులు పిలుపునిచ్చారు. రాష్ట్ర ముదిరాజ్ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ స్థాపించిన ముదిరాజ్ మహాసభ వందేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం ముదిరాజ్ మహాసభ యువజన విభాగం ఆధ్వర్యంలో పట్టణంలోని కాళీకాదేవి ఆలయం వద్ద మహాసభ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అతిథులు ముదిరాజ్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కొర్వి కృష్ణస్వామి జయంతి వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ వెనుకబడిన ముదిరాజ్‌ల అభ్యున్నతి కోసం అందురూ ఐక్యంగా ఉద్యమించి గుర్తింపును సాధించుకుందన్నారు. ప్రభుత్వాలు ముదిరాజ్‌లకు సముచిత స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆకుల రాములుముదిరాజ్, క్రిష్ణ ముదిరాజ్, లలిత రాజు, లొంక నర్సింలు, ఎస్‌పీ రవి, అల్లాపూర్ శ్రీ కాంత్, అమ్రేష్, రమేష్, రవిందర్ అడ్వకేట్, భీమశంకర్, యువనాయకులు నరేందర్ ముదిరాజ్, రమేష్ ముదిరాజ్, టీ.హనుమంతు, శ్రీనివాస్, జగన్, రమేష్, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
