రండి.. త్వరపడండి..!

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

రండి.. త్వరపడండి..!
– ఏటీసీ(ఐఐటీ)లో అడ్మిషన్లకు మరో చాన్స్‌
– గడువు, అర్హుతలు ఎప్పటి వరకు అంటే..?
తాండూరు, దర్శిని ప్రతినిధి : రండి.. త్వరపడండి అంటూ తాండూరు ఏటీసీ(ఐఐటీ) కేంద్రం విద్యార్థులను పిలుస్తోంది. తాండూరు ఏటీసీలో ప్రవేశాలకు మరో అవకాశం కల్పిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఎన్.సాయన్న ఓ ప్రకటనలో తెలిపారు.
kvcs
ఇప్పటికే 1వ ఫేస్, 2వ ఫేస్‌లో సీటు రాని అభ్యర్థులు కూడా మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. 2025 ఆగస్టు 1వ తేది నాటికి 14 సంవత్సరాలు పూర్తి చేసుకుని.. పదో తరగతి ఉత్తీర్ణులు అయిన వారు ప్రవేశాలకు అర్హులని చెప్పారు. దరఖాస్తు చేయడానికి ఈ http:/iti.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుందని తెలిపారు.

దరఖాస్తుల తరువాత ప్రభుత్వ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ లేదా ఐటిఐ తాండూర్ ని నేరుగా సంప్రదించాలని సూచించారు. మీ సర్టిఫికెట్లతో వెంటనే హాజరై సీటు పొందాలని, 100% ఉద్యోగ అవకాశాలు, అత్యాధునిక ల్యాబులు, పరిశ్రమలతో భాగస్వామ్యం ఉంటుందని స్పష్టం చేశారు. సీట్లు పరిమితంగా ఉన్నాయని, త్వరపడి చేరి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 8499975115, 9490120472లకు సంప్రదించాలన్నారు. ఈనెల 28వ తేది వరకు మాత్రమే ప్రవేశాలకు తుది గడువు అని చెప్పారు.

ఇదికూడా చదవండి…

మెథడిస్ట్ చెర్చ్‌ల ఆభివృద్ధికి కృషి