బీసీలకు రాజకీయ స్వాతంత్రం రావాలి
– అంతా ఏకమై సాధించుకుందాం
– బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : 78 ఏండ్ల దేశ స్వాతంత్రంలో బీసీలు ఇంకా వెనుకబాటుకు గురయ్యే ఉన్నారని, దేశానికి వెన్నెముక అయిన బీసీలకు రాజకీయ స్వాతంత్రం రావాలని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ అన్నారు.

శుక్రవారం తాండూరు పట్టణం పటేల్ చౌరస్తా వద్ద సర్దార్ పటేల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నారు. కార్యక్రమంలో కందుకూరి రాజ్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగఫలంతో దేశానికి స్వాతంత్రం సాధించుకున్నామన్నారు. కాని 78 ఏండ్ల స్వాతంత్రంలో బీసీలు ఇంకా వెనుకబాటుకు గురయ్యే ఉన్నారన్నారు. స్వాతంత్రం అంటే రాజకీయ స్వేచ్ఛ కాదు.. సామాజిక సమానత్వం, ఆర్థిక న్యాయం అన్నారు.

దేశానికి బీసీ సమాజం వెన్నెముకల నిలుస్తోందని, అందుకే బీసీలకు రాజకీయ, ఆర్థిక స్వాతంత్రం రావాల్సిన అవసరముందన్నారు. ఇందుకోసం బీసీలంతా ఏకమైన సామాజిక, ఆర్థిక, రాజకీయ స్వాతంత్ర్యాన్ని సాధించుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర నాయకులు సయ్యద్ షుకూర్, జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్, మహిళ నాయకులు నర్సమ్మ, మంజుల, జగదీశ్వరి, సర్దార్ పటేల్ అసోసియేషన్ సభ్యులు జోసఫ్, లింగం, రమేష్, అజయ్, రాయల్ రాజ్, భజరంగ్ దళ్ నాయకులు రజనీ, గ్లోబల్ యువతరం నాయకులు అరుణ్ రాజ్, నాగేందర్, బీసీ సంఘం నాయకులు బసవరాజ్, రాము ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

