ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

తాండూరు రాజకీయం వికారాబాద్

ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
– జెండా ఎగురవేసిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– సామూహిక వేడుకలలో గౌరవ వందనం స్వీకరణ
– పాల్గొన్న తాండూరు సబ్ కలెక్టర్, నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను తాండూరులో వేడుకలను వైభవంగా జరుపుకున్నారు. శుక్రవారం తాండూరులో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని వాడ వాడలా మువ్వన్నెల జెండాలను ఎగురవేశారు.
kvcs
పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు పలు పార్టీలు, సంఘాల కార్యాలయాల్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను సంబరంగా జరుపుకున్నారు. తాండూరు ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, పార్టీ నాయకులతో కలిసి జాతీయ జెండాను ఎగురవేశారు. అదేవిధంగా మున్సిపల్ కార్యాలయంలో కూడా జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి, నేతలు, మాజీ కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ కార్యాలయాలలో….
తాండూరు న్యాయస్థానం, జిల్లా ఆస్పత్రి, మాతా శిశు ఆసుపత్రి, డీఎస్సీ కార్యాలయం, పోలీస్టేషన్, తాండూరు మార్కెట్ కమిటి కార్యాలయాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను సంబరంగా జరుపుకున్నారు. ఈ వేడుకలలో ఆయా శాఖల అధికారులు, సిబ్బంది. పట్టణ ప్రముఖులు, పలు పార్టీల నేతలు, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని జాతీయ గీతాన్ని ఆలపించారు. మరోవైపు స్వచ్చంద సంఘాలు, యువజన సంఘాలు, కుల. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.

కాలేజీ మైదానంలో సామూహిక జెండా వేడుకలు
ప్రతి యేడాది మాదిరిగానే తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సాముహిక జెండా వేడుకలు నిర్వహించారు. తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ తో కలిసి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, తహ సిల్దార్ తారాసింగ్, నాయకులు డా. సంపత్ కుమార్, బంటు మల్లప్ప, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు కావలి సంతోష్ కుమార్, మహిళ అధ్యక్షురాలు గాజుల మాధవి, మార్కెట్ కమిటి డైరెక్టర్లు, మాజీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నేతలు, కౌన్సిలర్లు. పాఠశాలల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

సబ్ కలెక్టర్ కార్యాలయంలో
తాండూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ జెండా ఆవిష్కరించి వందనం సమర్పించారు. ఆనంతరం పలువురు విద్యార్థులకు పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

రేపు, ఎల్లుండి మాంసం విక్రయాలు బంద్