హిందూ ఉత్సవ సమితి రూ.51 వేల విరాళం
– అందజేసిన ఏఎంసీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు హిందూ ఉత్సవ కేంద్ర సమితికి రూ.51 వేల విరాళం అందింది. సోమవారం తాండూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, వినాయక గ్రూప్స్ అధినేత వర్త్యా విఠల్ నాయక్ ఈ విరాళం అందజేశారు.

హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు, సభ్యులు విఠల్ నాయక్ ను కలిశారు. ఈ సందర్భంగా హిందూ ఉత్సవ సమితికి విఠల్ నాయక్ రూ.51 వేలను విరాళంగా అందజేశారు. అదేవిధంగా హిందూ ఉత్సవ సమితి కార్యక్రమాలకు తోడ్పాటు అందిస్తానని విఠల్ నాయక్ అన్నారు. ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ సమితి కోశాధికారి రొంపల్లి సంతోష్ కుమార్, అధికార ప్రతినిధి పర్యాద రామకృష్ణ, ఉపాధ్యక్షులు గూలి పరమేశ్వర్, కోటం ప్రసాద్, సహాయ కార్యదర్శులు పడిమతి వెంకట్, రజక నర్సింహా, లోకేష్, ప్రచార కార్యదర్శులు కుమార్ వాల్మీకి తదిరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

