లంచావతారునిపై ఏసీబీ పంజా..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

లంచావతారునిపై ఏసీబీ పంజా..!
– ఇంటి నెంబర్ కోసం డబ్బులు డిమాండ్
– రెడ్ హ్యాండెండ్ గా దొరికిన మున్సిపల్ ఉద్యోగి
– తాండూరు కార్యాలయంలో కలకలం
– వివరాలు వెల్లడించిన ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఇంటి నెంబర్ కేటాయింపు కోసం డబ్బులు డిమాండ్ చేసి లంచావతారం ఎత్తిన మున్సిపల్ అధికారిపై ఏసీబీ అధికారులు పంజా విసిరారు.

kvcs

బాధితుని నుంచి డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెండ్ గా పట్టుకున్నారు. ఈ సంఘటన మంగళవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో కలకలం రేపింది. అధికార యంత్రాంగాన్ని ఉలిక్కి పాటుకు గురి చేసింది. ఉమ్మడి రంగారెడ్డి రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ వివరాలు వెల్లడించారు.

తాండూరు పట్టణంకు చెందిన ఓ వ్యక్తి మున్సిపల్ పరిధి సర్వే నెంబర్ లో టీన్ షెడ్డు నిర్మాణం చేసుకుంటున్నారు. దీనికి ఇంటి నెంబర్ కేటాయింపు చేయాలని తాండూరు మున్సిపల్ లో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న బెజ్జ రమేష్ ను సంప్రదించి దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు తీసుకున్న అధికారి రమేష్ ఇంటి నెంబర్ కేటాయింపు కోసం రూ. 15వేలు డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకోలేను అని అంటే మీరు లోకల్ కాబట్టి రూ.15వేలు అని ఫిక్స్ చేశారు. అంత పెద్ద మొత్తం ఇచ్చుకోవడం ఇష్టం లేని దరఖాస్తు దారుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

ఈ మేరకు రంగారెడ్డి రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో స్కెచ్ వేశారు. మంగళవారం అధికారి రమేష్ దరఖాస్తు దారుని నుంచి రూ. 15వేల నగదును తీసుకుంటుండగా దాడులు చేసి రెడ్ హ్యాండెండ్ గా పట్టుకున్నారు. రమేష్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అనంతరం డీఎస్పీ ఆనంద్ కుమార్ వివరాలు వెల్లడించారు. ఇంకా ఇందులో ఎవరిదైనా ప్రమేయం ఉందా అనే విషయంలో దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఎవరైనా ప్రభుత్వ అధికారులు డబ్బులు రూపంలో గానీ, వస్తువుల రూపంలో డబ్బులు డిమాండ్ చేస్తే ఏసీబీకి పిర్యాదు చేయాలని సూచించారు. మరోవైపు విశ్వనీయ సమాచారం ప్రకారం.. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ నాయకుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించి పిర్యాదు చేసినట్లు తెలిసింది.

 

ఇది కూడా చదవండి…

ప్రపంచంలోనే వైవిద్యం.. పోటోగ్రఫీ..!