హిందూ ఉత్సవ సమితికి చీఫ్ విఫ్ భారీ విరాళం..!
– రూ. 3లక్షల 1వెయ్యి 116ల ప్రకటించిన మహేందర్ రెడ్డి
– కుమారుడు రినీష్ రెడ్డి చేతుల మీదుగ అందజేత
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు హిందూ ఉత్సవ కేంద్ర సమితికి తెలంగాణ రాష్ట్ర చీప్ విప్ మహేందర్ రెడ్డి భారీ విఠాళం అందించారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని తన నివాసంలో మహేందర్ రెడ్డి కుమారుడు రినీష్ రెడ్డి చేతుల మీదుగా సమితి సభ్యులకు అందజేశారు.

వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొనేందుకు రినీష్ రెడ్డి తాండూరుకు వచ్చారు. ఈ సందర్భంగా హిందూ ఉత్సవ సభ్యులను ఆయన కలిశారు. చీప్ విప్ మహేందర్ రెడ్డి హిందూ ఉత్సవ సమితికి ప్రకటించిన రూ. 3లక్షల 1వెయ్యి 116లను హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలుకు అందజేశారు.

అనంతరం రినీష్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. పండగను ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ పరిమళ రవీందర్, యువ నాయకులు బిర్కడ్ రఘు, పునీత్, హిందూ ఉత్సవ సమితి అధికార ప్రతినిధి పర్యాద రామకృష్ణ, సహా కార్యదర్శులుగా పరమతి వెంకటేశం (మిర్చి), మంతన్ గౌడ్ అశోక్, రజక నర్సింహా, వద్దే పరమేష్, సాంస్కృతిక కార్యదర్శులుగా దేవగారి రమేష్, దివిటి ఎల్లప్ప తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

