వినాయకుడికి వీడ్కోలూ..!

తాండూరు రాజకీయం వికారాబాద్

వినాయకుడికి వీడ్కోలూ..!
– యశోధనగర్‌ గణనాధుని నిమజ్జనం
– ఊరేగింపుతో సాగనంపిన భక్తులు
– భక్తులతో కలిసి పాల్గొన్న రాజుగౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : బైబై గణేషా అంటూ తాండూరు పట్టణంలోని యశోధ నగర్‌లో ప్రతిష్టించిన వినాయకుడికి భక్తులు వీడ్కోలు పలికారు.
kvcs
మూడో రోజు శుక్రవారం గణనాధున్ని నిమజ్జనంకు తరలించారు. వినాయక చవితి సందర్భంగా కాలనీలో వినాయకున్ని ప్రతిష్టించారు. మూడు రోజుల పాటు భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. మూడో రోజు శుక్రవారం నిమజ్జనానికి తరలించారు. వినాయకుని ముందు బ్యాండు బాజాలతో మహిళలు, యువకులు నృత్యాలు చేస్తూ ముందుకు సాగారు.

జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజు గౌడ్, జుంటుపల్లి అరవింద్ కుమార్ రెడ్డి, మధుగౌడ్, బంటారం మధు, బాలు, శ్రీకాంత్, వినయ్ పలువురు గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఊరేగింపులో నృత్యాలు చేస్తూ గణపతిని కాగ్నానదిలో నిమజ్జనం చేశారు.

ఇదికూడా చదవండి…

హిందూ ఉత్సవ సమితికి చీఫ్‌ విఫ్‌ భారీ విరాళం..!